తల్లి చావు బిడ్డ ప్రాణం పోయేలా చేసింది.

తల్లి చావు బిడ్డ ప్రాణం పోయేలా చేసింది.

ఒక తల్లి తన చంటి బిడ్డ ప్రాణం పోవడానికి కారణం అంటే ఎంత హృదయ విదారకమైన దృశ్యం . బిడ్డకు పాలిస్తూనే ఆ తల్లి ఒక్కసారిగా కుప్పలిపోయింది. తన ఒళ్లో ఉన్న బిడ్డపై పడటంతో చిన్నారి కూడా అక్కడికక్కడే కన్నుమూసింది. ఈ హృదయవిదారకర సంఘటన అర్జెంటీనాలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ విషాద ఘటన అందర్నీ కంట తడి పెట్టించింది. A Very Heart Breaking News-entertainmentdessert.com

Alsoread: మీ స్మార్ట్ ఫోన్ తోనే Kaరోనా టెస్ట్..! 30 సెకెన్లలో రిజల్ట్.. | Test in 30 seconds with smartphone

A Very Heart Breaking News

ఈ సంఘటన అర్జెంటీనాలోని కోర్రియెంట్స్‌కు చెందిన గేబ్రియల్‌, మరియానా ఒజేడా (30) దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు ఆడ పిల్లలు కాగా, ఒకరు మగ పిల్లాడు. ఇదిలావుంటే, ఇటీవలే ఓ చిన్నారికి జన్మనిచ్చింది. కొద్దిరోజుల క్రితం మరియానా భర్త ఆఫీసు వెళ్లడంతో ఇంటి పనుల్లో నిమగ్నమైంది. పెద్ద కూతురు వల్ల అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. కుమారుడు, ఒక నెల చంటి బిడ్డతో ఆమె ఇంట్లోనే ఉండిపోయింది. మధ్యాహ్నం సమయంలో మరియానా బిడ్డకు పాలుపడుతోంది. ఇదే సమయంలో మరియానా అధిక బీపీతో హఠాత్తుగా బిడ్డపై కుప్పకూలి కన్నుమూసింది. తల్లి నేరుగా ముఖంపై పడటంతో ఊపిరాడక చంటిపాప కూడా మరణించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మూడేళ్ల కుమారుడు సైతం ఏం జరిగిందో తెలియక నిలబడిపోయాడు. A Very Heart Breaking News-entertainmentdessert.com

Alsoread: అతిగా శానిటైజర్‌ వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా?అసలు ఎప్పుడు వాడాలో తెలుసుకుందాం.

A Very Heart Breaking News

మరియానా భర్త గేబ్రియల్‌ ఇంటికి ఫోన్‌ చేయగా ఫోన్‌ రింగవుతున్నా ఎంతసేపటికీ ఎవరూ లిఫ్ట్‌ చేయలేదు. కొద్దిసేపటి తర్వాత ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన కుమారుడు. తల్లి నిద్రపోతోందని తండ్రికి చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన గేబ్రియల్‌ వెంటనే ఇంటికి వెళ్లాడు. బెడ్డుపై జీవచ్ఛవాల్లా పడి ఉన్న భార్య, బిడ్డను చూసి తల్లడిల్లిపోయాడు. ఆ ఘోరమైన పరిణామంతో తేరుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లి, బిడ్డ శరీరాలపై ఎటువంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు.

Alsoread:పెళ్లి అయిన కాబోయే ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి ఈ వీడియో చూడండి.

Share
%d bloggers like this: