ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడండి,మీ ఖాతాలను సేఫ్ గా ఉంచుకోండి.

ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడండి,మీ ఖాతాలను సేఫ్ గా ఉంచుకోండి.

మీరు ట్రేడింగ్ యాప్ వాడుతున్నారా? కొత్తగా ప్రారంభించిన మా మొబైల్‌ యాప్‌ ట్రేడింగ్‌లో రూ.10వేలు మదుపు చేస్తే… రోజుకు రూ.వెయ్యి చొప్పున లాభం, పదోరోజు మదుపు మొత్తం.. ఇలా పదిరోజుల్లో రూ.20వేలు ఇస్తాం అంటూ సైబర్‌ నేరస్థులు వాట్సాప్‌లు, ఫోన్లకు లింకులు పంపుతున్నారు. పదిరోజుల్లో పెట్టుబడితో పాటు రూ.పదివేలు ఆదాయం వస్తుందన్న ఆశతో వేలమంది బాధితులు సదరు యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదులతో ఈ నయామోసం వెలుగుచూసింది. రోజుకు వేలమంది మోసపోతున్నారని, సైబర్‌ నేరస్థులు రూ.కోట్లు కొల్లగొడుతున్నారని పోలీసులు అంచనా వేశారు. హైదరాబాద్‌, బెంగళూరు, ముంబయి నగరాల్లో ఈ మోసాలు జరుగుతున్నట్టు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. తమ మోసాలను గుర్తించి అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు యత్నిస్తారన్న ముందస్తు అంచనాతో వారు తయారు చేసిన యాప్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉంచకుండా బాధితులకు లింకులు పంపుతున్నారని వివరించారు. Don’t install this type apps-entertainmendtdessert.com

Alsoread:పసుపు పాలు తాగుతున్నారా ఐతే ఈ వీడియో చూడండి.

Don't install this type apps

పెద్ద పెద్ద సంస్థలు, షేర్‌మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నందున రూ.కోట్లలో లాభం వస్తుందని, లాభాలను పంచేందుకు, యాప్‌లను ప్రాచుర్యం చేసేందుకు పదిరోజుల్లోనే పెట్టుబడి మొత్తాన్ని వెనక్కు ఇస్తున్నామని సైబర్‌ నేరస్థులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ యాప్‌ ద్వారా రూ.10వేలు నగదు బదిలీ చేసిన వారికి మరుసటి రోజు నుంచి వెయ్యి రూపాయల నగదు ఆదాయం అంటూ వారి బ్యాంక్‌ ఖాతా లేదా పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే ఖాతాల్లో జమచేస్తున్నారు. పది రోజుల పాటు రూ.వెయ్యి చొప్పున ఇచ్చాక రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టండి అంటూ వారిని ప్రోత్సహిస్తున్నారు. పదిరోజుల్లో పెట్టుబడితో పాటు రూ.పదివేలు వెనక్కి రావడంతో వేలమంది ఆశతో యాప్‌లలో పెట్టుబడి పెడుతున్నారు. Don’t install this type apps-entertainmendtdessert.com

Alsoread: అతిగా శానిటైజర్‌ వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా?అసలు ఎప్పుడు వాడాలో తెలుసుకుందాం.

Don't install this type apps

రోజుకు పదివేలు రూపాయలు ఇచ్చిన తర్వాత,రూ.లక్ష రూపాయలు మడుపు చేయండి.రోజుకు రూ.5 వేలు లాభం పొందండి అంటూ సైబర్‌ నేరస్థులు ఫోన్లు చేస్తున్నారు. నిత్యం పది, పదిహేను సార్లు ఫోన్‌చేసి రూ.లక్షల్లో మదుపు చేయించుకుంటున్నారు. అనంతరం వారి ఖాతాలో తొలి రోజు రూ.5వేలు, రెండోరోజు రూ.5వేలు ఇలా ఐదు రోజులు వరుసగా జమ చేస్తున్నారు. వాటిని తీసుకునేందుకు యాప్‌ నుంచి అనుమతి ఉండేలా షరతు విధిస్తున్నారు. డబ్బు తీసుకుంటాం, అని ఫోన్‌ చేస్తే ఇది కొత్త తరహా మనీ సర్కులేషన్‌ స్కీమ్‌… ముగ్గురిని సభ్యులుగా చేర్పిస్తే ఆ నగదు తీసుకునేందుకు వీలుంటుంది. లేదంటే మూడు నెలలలయ్యాక మీరు మదుపు చేసిన రూ.లక్ష ఇస్తాం అంటూ మాట్లాడుతున్నారు. బాధితులు తమ స్నేహితులు, సన్నిహితులు, బంధువులతో రూ.10వేల నుంచి రూ.లక్ష మదుపు చేయించిన వెంటనే నిందితులు ఆర్థిక లావాదేవీలను నిలిపేస్తున్నారు. ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు.

Alsoread:ప్రతి తల్లి తండ్రి కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు.

Share
%d bloggers like this: