రోడ్డుపై 2 లక్షల డోసుల వ్యాక్సిన్లు,అలా వదిలేసారేంటి? అసలు ఎందుకు వదిలేశారు?

రోడ్డుపై 2 లక్షల డోసుల వ్యాక్సిన్లు,అలా వదిలేసారేంటి? అసలు ఎందుకు వదిలేశారు?

దేశమంతా ఓవైపు కరోనా వ్యాక్సిన్ కోసం క్యూలు కడుతుంటే,కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ల కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచి వ్యాక్సిన్ల కోసం క్యూలలో నిలబడుతున్నారు. ఓ పక్క పరిస్థితులు అలా ఉంటే మరోవైపు లక్షల కొద్దీ డోసుల వ్యాక్సిన్‌ను నడి రోడ్డు పక్కన వదిలేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కరేలీ బస్టాండ్ దగ్గర సుమారు 2.4 లక్షల కొవాగ్జిన్ డోసులు ఉన్న ట్రక్‌ను వదిలేసిపోయారు. ఆ ట్రక్ చాలా సేపటి నుంచి అక్కడే ఉండటం అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ట్రక్ లో కరోనా వ్యాక్సిన్‌ను గుర్తించారు. vaccine truck on the roadside-entertainmentdessert.com

Alsoread: ఈ రెండు పువ్వులు చాలు శృంగారంలో మీరే రారాజు.

vaccine truck on the roadside

ఈ ట్రక్కులో డ్రైవర్ క్లీనర్‌ గానీ ఎవ్వరూ కనిపించకపోవటంతో ఆ వ్యాక్సిన్ల ట్రక్కుని అక్కడ ఎవరు వదిలేశారు? ఎటువంటి పరిస్థితుల్లో వదిలేశారు? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యాక్సిన్ల మొత్తం ఖరీదు రూ. 8 కోట్ల వరకూ ఉంటుందని కరేసీ ఎస్ఐ ఆశిష్ బొపాచె వెల్లడించారు. డ్రైవర్ ఫోన్ నంబర్ తెలుసుకొని ట్రేస్ చేయగా డ్రైవర్ ఫోన్ రోడ్డు పక్కన పొదల్లో దొరికిందని తెలిపారు. vaccine truck on the roadside-entertainmentdessert.com

Alsoread: కరోనా పాజిటివ్ వచ్చింది అని మీకు తెలిస్తే? ఏం చేయాలి? ఏం చేయకూడదు?

vaccine truck on the roadside

ఆ ట్రక్‌లో ఏసీ పని చేస్తోందని, దానిని బట్టి వ్యాక్సిన్లన్నీ సురక్షితంగానే ఉన్నాయని తెలిపారు. కానీ ఆ ట్రక్కుకు సంబంధించిన డ్రైవర్‌, క్లీనర్లు ఎందుకు దాన్ని అక్కడ వదిలేసి పోయారు?ఎక్కడ నుంచి ఎక్కడకు తరలిస్తున్నారు. మధ్యలో ఎందుకు వదిలేశారు? వాళ్లు ఎక్కడున్నారు? డ్రైవర ఫోన్ రో్డ్డు పక్క పొదల్లో ఎందుకు పడి ఉంది?వాళ్లు కావానే పడేశారా? లేదా ఫోన్ మిస్ అయ్యిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్, క్లీనర్లు కోసం గాలిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజలు వ్యాక్సిన్ కోసం చాలా అల్లాడి పోతున్నారు.

Alsoread: పెళ్లి అయిన కాబోయే ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి ఈ వీడియో చూడండి.

Share
%d bloggers like this: