హృదయవిదారక దృశ్యం….సార్ మా అమ్మ చచ్చిపోతుంది..అలా చేయకండి.

హృదయవిదారక దృశ్యం….సార్ మా అమ్మ చచ్చిపోతుంది..అలా చేయకండి.

ఆక్సిజన్ సిలిండర్లు తరలిస్తున్న పోలీసుల వద్ద మోకాళ్లపై దండం పెడుతూ..
సార్ మా అమ్మ చచ్చిపోతుంది..అలా చేయకండి..అంటూ ఓ కొడుకు పడుతున్న బాధ అందరినీ కలిచివేస్తోంది. అతను వేడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆక్సిజన్ కోసం రోగులు, వారి కుటుంబసభ్యులు పడుతున్న బాధలు ఎలా ఉన్నాయో ఈ ఘటనే చూపిస్తోంది. ఆగ్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. This is a really heart breaking video-entertainmentdessert.com

Alsoread: దేవుడు లేడు అనే వాళ్లకి ఇది ఒక నిదర్శనం.

This is a really heart breaking video

కరోనా వైరస్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి తల్లికి కరోనా సోకింది. ప్రైవేటు ఆసుపత్రిలో చేరిపించి చికిత్స చేయిస్తున్నాడు. అయితే..ఈ ప్రైవేటు ఆసుపత్రి నుంచి పోలీసుల బందోబస్తు మధ్య ఆక్సిజన్ సిలిండర్లు తరలిస్తున్నారు. This is a really heart breaking video-entertainmentdessert.com

Alsoread: కరోనా పేషెంట్స్ కి అద్భుత వరంగా మారిన ఈ పరికరం.

This is a really heart breaking video

ఈ విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి ఆసుపత్రి బయటకు వచ్చి..మోకాళ్లపై నిల్చొని దండం పెడుతూ..ఆక్సిజన్స్ సిలిండర్లను తరలించవద్దని ప్రాథేయపడ్డాడు. ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళితే..తన తల్లి చనిపోతుందని, తాను ఆక్సిజన్ సిలిండర్లను ఎక్కడి నుంచి తీసుకరావాలని ప్రశ్నించాడు.తన తల్లిని ఆరోగ్యంగా ఇంటికి తీసుకొస్తానని..తన కుటుంబసభ్యులకు మాటిచ్చానని..దయచేసి ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళ్లవద్దని మోకాళ్లపై కూర్చొని దండము పెడుతూ ప్రాథేయపడ్డాడు. కానీ పోలీసులు మాత్రం తమ పనిలో బిజీగా ఉన్నట్లు కనిపించారు. ఆక్సిజన్ సిలిండర్ ను తీయవద్దని పోలీసులను వేడుకోవడం కండ్లు చమర్చేలా ఉందని, యూపీ పోలీసుల తీరు అమానవీయమని ఈ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేస్తూ యూత్ కాంగ్రెస్ యోగి సర్కార్ పై విమర్శలు చేసింది.

Alsoread: కరోనా భారీ నుండి తప్పించుకునే అద్భుత మార్గం || Disinfection chamber To Keep You Safe

Share
%d bloggers like this: