భారత మార్కెట్లోకి కొత్త మందు, మిగతా వాటికి దీనికి తేడా ఏంటి?

భారత మార్కెట్లోకి కొత్త మందు, మిగతా వాటికి దీనికి తేడా ఏంటి?

  • డ్రాగ‌న్ కంట్రీలో పుట్టిన కోవిడ్ 19 క్ర‌మంగా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది.. కాలం గ‌డిచే కొద్ది కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతూనే ఉన్నాయి.. ఫ‌స్ట్ వేవ్ ఒక ర‌క‌రంగా ఉంటే.. ఇప్పుడు సెకండ్ వేవ్ క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.. ఈ త‌రుణంలో.. వ్యాక్సిన్ల గురించి కూడా పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.. ఇప్ప‌టికే ప‌లు ర‌కాల టీకాలు అందుబాటులోకి వ‌చ్చాయి.. ఇక‌, ఆ మ‌ధ్యే క‌రోనా వైరస్​ ఉద్ధృతికి కళ్లెం వేసే యాంటీవైరల్​ ఔషధాన్ని గుర్తించారు అమెరికా శాస్త్రవేత్తలు. కోవిడ్ బాధితుడి నుంచి 24 గంటల్లోనే వైరస్​ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తేల్చారు.. అదే.. మోల్నుపిరావిర్​ అనే యాంటీవైరల్​ ఔషధం. New Covid Vaccine in Indian Market-entertainmentdessert.com

Alsoread: ఈ పనులు చేయకండి,చిక్కుల్లో పడకండి.

New Covid Vaccine in Indian Market
  • మోల్నుపిరవిర్
  • ఈ మందు తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. దీన్ని తయారు చేసేందుకు MSD ఫార్మాసూటికల్స్ ఐదు భారత ఫార్మా కంపెనీలకు లైసెన్స్ ఇచ్చింది. ఈ మందుపై పరిశోధన చేసిన అమెరికా పరిశోధకులు, గత డిసెంబర్‌లో ఒక కొత్త విషయాన్ని కనుగొన్నారు. MK-4482/EIDD-2801 లేదా మోల్నుపిరవిర్‌ డ్రగ్.. 24 గంటల్లోనే కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేయడంతో పాటు వైరస్ వ్యాప్తిని పూర్తిగా అణిచివేస్తోందని వారు గుర్తించారు. భారత్‌లో ఎక్కువ కోవిడ్ కేసులకు కారణమవుతున్న డబుల్ మ్యూటెంట్ వేరియంట్ (B.1.617) విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ మెడిసిన్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లపై మోల్నుపిరవిర్ సమర్థవంతంగా పనిచేస్తోందని జార్జియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు సైతం నిర్ధారించారు. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని నేచర్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురించారు. అయితే ఈ డ్రగ్‌పై కూడా వివాదాలు చెలరేగాయి. మోల్నుపిరవిర్ హానికరమైన జన్యు ఉత్పరివర్తనాలకు కారణమవుతుందని కొంతమంది పరిశోధకులు ఆరోపించారు. దీంట్లో మ్యుటాజెనిక్ (DNA డ్యామేజింగ్) లక్షణాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ డ్రగ్ అభివృద్ధికి అమెరికా ప్రభుత్వం నిధులు సమకూర్చడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. New Covid Vaccine in Indian Market-entertainmentdessert.com

Alsoread: కరోనా పాజిటివ్ వచ్చింది అని మీకు తెలిస్తే? ఏం చేయాలి? ఏం చేయకూడదు?

New Covid Vaccine in Indian Market
  • రెమ్‌డెసివిర్
  • ఈ మందును గిలియడ్ సైన్సెస్ అనే బయోఫార్మా కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ బ్రాడ్ స్పెక్ట్రం యాంటీవైరల్ మందును కోవిడ్‌ రోగుల చికిత్సలో వాడుతున్నారు. భారత్‌లో ప్రస్తుతం దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. COVID-19 చికిత్సలో అత్యవసర వినియోగానికి రెమ్‌డెసివిర్ వాడేందుకు ప్రభుత్వం ఆమోదించింది. రెమ్‌డెసివిర్‌ను హెపటైటిస్ సి చికిత్స కోసం అభివృద్ధి చేశారు. తరువాత ఎబోలా వైరస్, మార్బర్గ్ వైరస్ ఇన్‌ఫెక్షన్ల నివారణకు ఉపయోగించారు. తీవ్రమైన లక్షణాలు ఉండే కోవిడ్ రోగులపై రెమ్‌డెసివిర్‌ ప్రభావవంతంగా పనిచేస్తుందని, వ్యాధి నుంచి కోలుకునే సమయాన్ని ఈ మందు తగ్గిస్తోందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి.

Alsoread: కరోనా కి కాదు సీలింగ్ ఫ్యాన్ ని చూసి భయపడుతున్న పేషెంట్లు.

Share
%d bloggers like this: