ఒకే అంబులెన్స్‌లో 22 మంది మృతదేహాలను తరలించిన ఘటన….! అసలు ఏం జరుగుతుంది?

ఒకే అంబులెన్స్‌లో 22 మంది మృతదేహాలను తరలించిన ఘటన….! అసలు ఏం జరుగుతుంది?

భారతదేశంలో కరోనా నృత్యం ఎంత దారుణంగా ఉందో తెలిపే ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కరోనాతో చనిపోయివారి మృతదేహాలను తరలింపు విషయంలో చోటుచేసుకున్న ఒకే అంబులెన్స్‌లో 22 మంది మృతదేహాలను తరలించిన ఘటన చూస్తే భారత్ లో కరోనా ప్రభావం ఎంతగా భారీగా ఉందో ఈ దయనీయ స్థితి చూస్తే అర్థమవుతోంది. కరోనా కేసుల విషయంలో దేశం అంతా ఒక ఎత్తు ఒక్క మహారాష్ట్ర ఒక ఎత్తు అన్నట్లుగా ఉంది పరిస్థితి.22 covid bodies in ambulance-entertainmentdessert.com

Alsoread: లైంగిక కోరికల అన్ని సమస్యలకూ ఈ వీడియో పరిష్కారం.

22 covid bodies in ambulance

అధికారులు మాత్రం ఈ విషయాన్ని తేలిక చేస్తున్నారు. ప్రతి మృతదేహాన్నీ బాడీ బ్యాగుల్లో ఉంచారనీ… వాటిని అంబాజోగాయ్‌లోని స్వామి రామనంద తీర్థ మరాట్వాడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ (SRTMGMC) మార్చురీ నుంచి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆస్పత్రి రికార్డుల ప్రకారం ఆ అంబులెన్స్‌… మొబైల్ ICUగా ఉంది. దీనిపై ఉలిక్కిపడిన బీడ్ జిల్లా యంత్రాంగం… హడావుడిగా అంబాజోగాయ్‌కి ఓ టీమ్‌ని పంపింది. జిల్లా నుంచి ఆ ఏరియా 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మృతదేహాలకు సంబంధించిన వారిలో ఇద్దరు మొబైల్ ఫోన్లతో ఆ అంబులెన్స్‌ని ఫొటోలు, వీడియో తీస్తుంటే… తమను పోలీసులు అడ్డుకొని మొబైల్స్ లాక్కున్నారని ఆరోపించారు. అంత్యక్రియలు పూర్తైన తర్వాతే ఫోన్లు వెనక్కి ఇచ్చారని వారు తెలిపారు. ఇది నిజమేననీ, పోలీసులు మొబైల్స్ లాక్కోవడం తాను చూశానని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు.22 covid bodies in ambulance-entertainmentdessert.com

Alsoread: కరోనా పాజిటివ్ వచ్చింది అని మీకు తెలిస్తే? ఏం చేయాలి? ఏం చేయకూడదు?

22 covid bodies in ambulance

మృతుల బంధువుల్లో ఒకరు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇలా ఒకే అంబులెన్స్ లో 22 డెడ్ బాడీలు తరలించడమే కాకుండా..అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని తేలిగ్గా మాట్లాడుతున్నారని వాపోయారు. ఈ ఘటనపై SRTMGMC డీన్‌ డాక్టర్ శివాజీ సుక్రేని మాట్లాడుతూ..ఇక్కడ రెండు అంబులెన్సులు మాత్రమే అంత్యక్రియలకు తరలించడానికి ఉన్నాయి. అవసరానికి సరిపడా లేవు. అంబాజోగాయ్ సివిక్ బాడీ అధికారులకు మృతదేహాలను అంత్యక్రియల కోసం అప్పగించడమే మా పని. సివిక్ బాడీ ఏం చేస్తుందన్నది మాకు అనవసరం” అని తెలిపారు.

Alsoread: పెళ్లి కాని వారు మాత్రమే చూడండి.

Share
%d bloggers like this: