కరోనా వ్యాక్సిన్ కావాలా అయితే రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

కరోనా వ్యాక్సిన్ కావాలా అయితే రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

మే 1వ తేదీ నుంచి 18 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన వారికి కరోనా వ్యాక్సిన్‌ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్‌ తీసుకోవాలంటే కచ్చితంగా కోవిన్ వెబ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు దాటిన వారు కొవిన్‌ వెబ్‌పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవాలి. కానీ, వారు ఆధార్‌ కార్డుతో నేరుగా వాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్లినా వైద్య సిబ్బంది పేరు, వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. Covid Vaccination Registration Process-entertainmentdessert.com

Alsoread: విష్ణుప్రియ ని ఇలా చూస్తే ఎవ్వరూ తట్టుకోలేరూ భయ్యా…!

Covid Vaccination Registration Proces

ఈ వైరస్‌బారిన పడకుండా ఉండాలంటే ఏకైక మార్గం కరోనా వ్యాక్సినేషన్‌ ఒక్కటేనని ప్రభుత్వంతో పాటు వైద్యులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మే ఒకటో తేదీ నుంచి 18 యేళ్ళు పైబడి 45 యేళ్ళలోపు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ వ్యాక్సిన్‌ వేయనున్నట్టు కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆస్పత్రులకు కరోనా టీకాలను సరఫరా చేస్తామని తెలిపింది. అదేసమయంలో కోవిషీల్డ్‌ టీకాను తయారు చేసే కంపెనీ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ధరను నిర్ణయించింది. కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.600కి ఇస్తామని సీరమ్‌ సంస్థ ప్రకటించింది. అయితే, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగానే టీకాలు వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మే ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ ఉచిత వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వ ఆస్పత్రులకు సుమారుగా 60 శాతం ప్రజలు వస్తారని భావిస్తున్నారు. Covid Vaccination Registration Process-entertainmentdessert.com

Alsoread: అంతా షాక్…..అసలైన నిజం ఏమిటి అంటే…..!

Covid Vaccination Registration Proces
  • కోవిన్ వెబ్‌సైట్‌లో కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ విధానం ఇదే..
  • మొదటగా కోవిడ్ (www.cowin.gov.in) వెబ్‌సైట్‌కు వెళ్లండి. లేదా యాప్ అయినా సరే
  • మీ 10 అంకెల ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి
  • ఆ తరువాత ఓటీపీని ఎంటర్ చేయాలి
  • వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ ఉంటుంది
  • మీ ప్రాథమిక వివరాలు నమోదు చేయాలి
  • మీకు ఏ రోజు, ఏ సమయంలో వ్యాక్సిన్ తీసుకుంటారో స్లాట్ బుక్ చేసుకోవాలి
  • మీకు దగ్గర్లోని ఏదైనా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సెలక్ట్ చేసుకుని, మీ వివరాలు నిర్ధారించుకున్న తరువాత కన్ఫామ్ చేయాలి.

Alsoread: రోజుకి 2 టాబ్లెట్స్ వేసుకుంటే చాలు | Medicines for Fighting Carona Virus

Share
%d bloggers like this: