ఖాకీలకు వింత ఫిర్యాదు.. కానీ అది నిజమేనట!!మా కోడిపెట్టలు గుడ్లు పెట్టట్లేదు సార్…!

ఖాకీలకు వింత ఫిర్యాదు.. కానీ అది నిజమేనట!!మా కోడిపెట్టలు గుడ్లు పెట్టట్లేదు సార్…!

సార్.. మా కోడి గుడ్డు పెట్టట్లేదు అని బాధపడిపోతూ పోలీసులను ఆశ్రయించాడో వ్యక్తి. కోడి గుడ్డు పెట్టకపోతే పోలీస్ స్టేషన్‌కి వెళ్లడమేంటి అనుకుంటున్నారా? అవును మీరు చదివింది అక్షరాలా నిజమే!! ఆయన కోడి గుడ్డు పెట్టట్లేదట. అయితే ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆయన కోళ్ల ఫాంలో ఉన్న కోళ్లు గుడ్లు పెట్టడం మానేశాయట. కోళ్లు గుడ్లు పెట్టడం లేదన్న వింత ఫిర్యాదుతో పోలీసులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అయినా ఒక కోడి గుడ్డు పెట్టకపోతే ఫర్వాలేదు.. అన్ని కోళ్లూ గుడ్లు పెట్టడకపోవడంమేంటని ఆలోచించిన పోలీసులు అసలు విషయమేంటని ఆరా తీయడంతో తన గోడు వెళ్లబోసుకున్నాడు పౌల్ట్రీ రైతు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు……….

అంతకుముందు వరకు బాగానే గుడ్లు పెట్టిన కోళ్లు ఓ కంపెనీ తయారు చేసిన ఆహారం తిన్న తరువాతి నుంచి గుడ్లు పెట్టడం మానేశాయి. మొదట్లో యజమానులకు విషయం అర్థం కాలేదు. ఎందుకిలా జరుగుతుందా అని నిఘా వేస్తే… సదరు కంపెనీ ఆహారం వేయడం మొదలు పెట్టిన తరువాతే గుడ్ల ఉత్పత్తి తగ్గిందని తేలింది. దీంతో పోలీసులకు ఆ కంపెనీ మీద ఫిర్యాదు చేశారు. అదన్నమాట అసలు విషయం..ఈ కోళ్ల దాణాను సప్లయ్ చేసిన సంస్థ మరో మూడు, నాలుగు ఫౌల్ట్రీ ఫారాలకు కూడా దాణా సప్లయ్ చేసింది. ఆ సంస్థ దగ్గర దాణా కొన్ని ఫౌల్ట్రీ ఫారాల్లో కూడా ఇటువంటి సమస్య వచ్చింది. దీంతో పౌల్ట్రీ యజమానులు లబోదిబోమంటూ పోలీసుల దగ్గరకొచ్చి మొరపెట్టుకున్నాడు.
అహ్మాద్ నగర్ జిల్లాలోని ఒక కంపెనీ నుంచి కోళ్ల దాణాను కొనుగోలు చేశామని, దానిని కోళ్లకు వేసినప్పటినుంచి ఒక్క కోడి కూడా ఒక్కటంటే ఒక్క గుడ్డు కూడా పెట్టడం లేదని ఓ కోళ్ల ఫారం యజమాని వాపోయారు.

పశు వైద్యాధికారులు ఇచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. దీంట్లో భాగంగా సదరు సంస్థ అధికారులను పోలీసులు ప్రశ్నించారు. పౌల్ట్రీ యజమానుల గోల ఇలా ఉంటే వారికి దాణా అమ్మిన సంస్థ మాత్రం వారి ఆరోపణలకు కొట్టిపారేస్తున్నారు. ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమేనని తాము క్వాలిటీ గల దాణానే తయారు చేసి అమ్ముతున్నామని చెప్పుకొస్తున్నారు. కానీ తమ కోళ్లు గుడ్లు పెట్టకపోవటానికి కారణం ఆ కంపెనీ దాణా వల్లే జరిగిందంటూ పౌల్ట్రీ రైతులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మరి ఈ విచిత్ర కేసును పోలీసులు ఎలా పరిష్కారిస్తారో చూడాలి.అవసరమైతే నష్టపరిహారం అందజేస్తామని చెప్పిందని రాజేంద్ర చెప్పారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్‌కు విచారణకు రావాలని చెప్పామని.. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.

Share
%d bloggers like this: