గాంధీ ఆసుపత్రిలో కరోనా మరణాలు కలవర పెడుతున్నాయి.

గాంధీ ఆసుపత్రిలో కరోనా మరణాలు కలవర పెడుతున్నాయి.

గాంధీని మరోసారి పూర్తిస్థాయిలో కోవిడ్ ఆస్పత్రిగా మార్చింది ప్రభుత్వం. కరోనా కేసులకు మాత్రమే అక్కడ చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు గాంధీలో కరోనా మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.తెలుగురాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో కరోనా మరణాలు కలవర పెడుతున్నాయి. గాంధీ ఆస్పత్రిలో 3 రోజుల్లో 220కి పైగా మరణాలుచోటుచేసుకున్నట్లు సమాచారం. అధికారికంగా గాంధీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించలేదు. మృతదేహాలతో గాంధీ కరోనా మార్చురీ నిండిపోయింది. జనరల్ మార్చురీ బిల్డింగ్‌ను కూడా కరోనా మార్చురీగా మార్చారు.

గాంధీ ఆస్పత్రిలో నాన్‌ కొవిడ్ మృతదేహాల పోస్టుమార్టాలు నిలిచిపోయినట్లు తెలిసింది. పోస్టుమార్టం కోసం ఉస్మానియాకి గాంధీ సిబ్బంది రిఫర్ చేస్తున్నారు.గాంధీ ఆస్పత్రిని మళ్లీ పూర్తి స్థాయి కోవిడ్‌ హాస్పిటల్‌గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఔట్‌ పేషెంట్, ఇన్‌ పేషెంట్‌ సేవలు, సర్జరీలు నిలిపివేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో చికిత్స పొందుతున్న సాధారణ రోగులను డిశ్చార్జి చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనల్లో గాయపడి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నవారిని ఇతర ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నారు.

Share
%d bloggers like this: