ఒక ఆడపిల్ల కష్టం తెలుసా మీకు? అయితే ఒక్క సారి ఇది చూడండి.

ఒక ఆడపిల్ల కష్టం తెలుసా మీకు? అయితే ఒక్క సారి ఇది చూడండి.

ఏ ఆడపిల్ల అంతా త్వరగా తన కంట్లో నీళ్ళు కనపడనివ్వదు. ప్రతినెల ధారలాగా తన రక్తాన్ని దారాగా పోస్తుంది. ఈ శృష్టి లో అద్భుతం ఏంటి అంటే ఆడపిల్ల. ఎంత కష్టం వచ్చిన ముఖంలో బాధ కనిపించనివ్వదు. ఇంటి పని మొత్తం ఎలాంటి కంప్లయింట్ లేకుండా సంతోషంగానే చేస్తుంది.

ఆడపిల్ల గర్భవతి అయిన సమయం నుండి 9 నెలల పాటు తన బిడ్డను రక్తానే ఆహారంగా మార్చి ఒక అపురూపమైన బిడ్డను తయారు చేస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత అతని కి ఎంత చాకిరీ చేస్తుందో తెలుసా? పెళ్లి చేసుకోగానే తన ఇంటి పేరునే మార్చేసుకుంటుంది ఇస్తుంది.


ఇంత కష్టం చేసిన కొందరు అంటారు నువ్వు మా కోసం ఏం చేసావని అంత గింజుకుంటున్నావూ అని
ఒక్క సారి ఆలోచించండి అమ్మ కష్టం విలువ, ఒక్కసారి అమ్మ ప్రేమ గురించి ఆలోచన చేయండి. ఆడవారు అనే చులకన భావం వున్న వారు కాస్త ఆలోచించండి..


మనం గట్టిగా కష్టపడితే ఒక మూడు కేజీల ప్యాకెట్ ఏదైనా ఒక కిలోమీటరు లేదా రెండు కిలోమీటర్లు పట్టుకొని నడుచుకుంటూ వెళ్లేసరికి ఆ మూడు కేజీల బరువు కాస్త 30 కేజీల భరువు అవుతుంది, ఎప్పుడు దించేస్తామని చూస్తారు
కానీ ఒక బిడ్డ జన్మ ఇచ్చేసరికి మూడు కేజీలకు పైగా అంతకన్నా ఎక్కువ కూడా ఉంటుంది.


తొమ్మిది నెలలు మనల్ని మోసి, కనీ ఈ భూప్రపంచానికి పరిచయం చేస్తుంది.. మనలాగే తాను కూడా ఈ బరువు మోయలేక కొంచెం సమయం దించేద్దాం అనుకుంటే నువ్వు నేను మనము ఇంకా ఎవ్వరు ఈ భూమిపై ఉండేవారు కాదు కదా?

ఈ ఒక్క విషయం చాలదా ఒక ఆడపిల్లకు గౌరవ మర్యాదలు ఇవ్వడానికి, మనల్ని మోసే బరువుతో పాటు దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు తెలుసా మీకు? అవే వాంతులు మరియు నడుము నొప్పి తనకు ఎంత నొప్పి ఉన్నా భరించి మన ఒక్క ఏడుపు కేకతో తన మొత్తం బాధ నే మరిచిపోయి ముఖంలో చిరునవ్వు చిందిస్తుంది.

కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మ ప్రేమను మరవకండి. అమ్మ నుంచి వచ్చిన ప్రతి అమ్మాయి అమ్మ అవుతుంది. ప్రతి అత్త ప్రతి కోడలు ఒక అమ్మనే అనే విషయాన్ని అత్తలు కోడళ్ళు మరచిపోకండి. కాబట్టి అబ్బాయిలు అమ్మ గొప్పతనాన్ని అమ్మాయి ప్రేమతో మర్చిపోకండి. తరాలు మారిన యుగాలు మారిన తల్లి ప్రేమ చాలా గొప్పది.

Share
%d bloggers like this: