తప్పుడు ప్రచారాలను అసలు నమ్మవద్దు.

తప్పుడు ప్రచారాలను అసలు నమ్మవద్దు.

తెలంగాణ రాష్ట్రం లోని విద్యాసంస్థలు కోవిడ్-19 నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్య మంత్రి కే. చంద్ర శేఖర్ రావు ఆదేశించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు.

రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ చర్యలు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలీ అనే విషయాన్ని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు

రాష్ట్రం లో కొవిడ్‌-19 కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వస్తుంది అన్న నేపథ్యంలో డిసెంబర్‌ 2 వ తారీకు నుండి రాష్ట్రంలో విద్యాసంస్థలు బంద్‌ కానున్నట్లు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదు.

కరోనా వ్యాప్తి పెరగకుండా తగు జాగ్రత్త చర్యలు చేయాలని, విద్యాసంస్థల్లో విద్యార్థులు దూరం పాటించాలని, తప్పని సరిగా మాస్కులు ధరించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు.

తెలంగాణ లో విద్యాసంస్థలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని, విద్యా సంస్థ లకు ఎటువంటి సెలవులు ప్రకటించలేదు అని చెప్పారు.

Share
%d bloggers like this: