రోజులో ఎన్ని సార్లు మూత్ర విసర్జన చేయాలో తెలుసా?

రోజులో ఎన్ని సార్లు మూత్ర విసర్జన చేయాలో తెలుసా?

మన శరీరంలోని మూత్రపిండాలు రక్తం లోని అన్ని వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయి. మూత్రవిసర్జన అంటే మన శరీరంలోని వ్యర్థాలను ద్రవ రూపంలో బయటకి విసర్జించడం. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.

మూత్రవిసర్జన అనేది మనిషికి మేలు చేసే ఒక చర్య. మనిషి రోజుకు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయాలో అనేది కచ్ఛితముగా తెలుసుకోవాలి. మూత్రవిసర్జన అనేది ప్రతిరోజూ జరిగే ఒక చర్య. ఈ చర్య ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. రోజుకు 5 సార్లు మూత్ర విసర్జన చేయవచ్చు,

మరియొక రోజు 8 సార్లు ఉండవచ్చు, రోజుకు 4 సార్లు మాత్రమే ఉండవచ్చు. కాబట్టి మనం నీటిని తాగే విధానాన్ని బట్టి ఇది మారుతుంది. అయితే ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు కనీసం 4 సార్లు మూత్ర విసర్జన చేస్తాడు.

ఒక రోజుకు కనీసం 4 సార్లు కాబట్టి 6-8 సార్లు జరిగినా పర్వాలేదు. రోజుకు 4-10 సార్లు మూత్ర విసర్జన చేయడం ఆరోగ్యకరం. కానీ మీరు తక్కువ నీరు త్రాగి 8-10 సార్లు మూత్ర విసర్జన చేస్తే, అప్పుడు ఏదో సమస్య ఉన్నట్లు అనిపిస్తుంది.

అలాగే రోజుకు కనీసం 4 సార్లు మూత్ర విసర్జన చేయకపోవడం వల్ల మనిషి ఆరోగ్యంగా లేడు. అయితే తక్కువ నీరు తాగడం వల్ల మూత్రపిండాలు సరిగా పనిచేయవు.

మగవారు రోజుకు మంచి నీటిని 3.7 లీటర్లు, ఆడవారు 2.7 లీటర్లు తాగాలి. అప్పుడే మూత్ర విసర్జన సక్రమంగా జరుగుతుంది. మన శరీరంలోని వ్యర్ధాలు బయటకు వెళ్ళి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
.

Share
%d bloggers like this: