సముద్ర తీరాన బయట పడుతున్న బంగారం.

సముద్ర తీరాన బయట పడుతున్న బంగారం.

ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో చాలా రోజుల నుండి వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్నారు ప్రజలు.. వజ్రాలు దొరికి కొందరు లక్షలు సంపాదిస్తే.. కొందరు కోటీశ్వరులు అయ్యారని చెబుతారు.

ఉన్నట్టుండి ఇప్పుడు ఉప్పాడ సముద్ర తీరప్రాంతంలో బంగారపు నగలు దొరుకుతున్నాయనే మాట.. స్థానికుల చెవినపడింది… గత రెండు రోజులుగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో బంగారం కోసం జల్లెడ పడుతున్నారు.

కొందరికి బంగారు రేణువులు, రూపులు, చెవి దిద్దులు, ఉంగరాలతో పాటు పలు బంగారు, వెండి వస్తువులు దొరికాయని చెబుతున్నారు. కొందరికి బంగారు నగలు దొరకగా.. గురువారం రోజు కూడా ఉదయమే వెళ్లి సముద్ర తీర ప్రాంతాన్ని జల్లెడ పెడుతున్నారు

కొన్ని ఏళ్ల క్రితం రాజుల కోటలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుఫాన్‌ సమయాల్లో బయటపడుతున్నాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నమాట..

రెండు వరుస తుఫాన్లతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరోవైపు ఈ బంగారం వేట కొనసాగుతోంది. అయితే, సముద్రతీరంలో బంగారం, బంగారు ఆభరణాలు లభ్యం కావడం మాత్రం మిస్టరీగానే మిగిలిపోతోంది.

ఇంతకు ముందు ఒక సారి కూడా ఉప్పాడ బీచ్‌లో బంగారు నగలు దొరికిన సంగతి విదితమే. ఈ విషయం తెలిసిన మత్స్యకారు, మరియు చిన్న పిల్లలు సైతం బంగారం కోసం వెతుకుతున్నారు.

Share
%d bloggers like this: