క్రికెట్ ఫ్యాన్స్ కి పండగ….ఇక థియేటర్ లోనే లైవ్ మ్యాచ్ లు.

క్రికెట్ ఫ్యాన్స్ కి పండగ….ఇక థియేటర్ లోనే లైవ్ మ్యాచ్ లు.

T20 World Cup: భారత్ క్రికెట్ టీంలో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2021ను ప్రత్యక్ష ప్రసారం చేసి క్రికెట్ ఫ్యాన్స్ ని ఆనందింప చేయడానికి ఐసీసీ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు పీవీఆర్ సినిమాస్ కూడా ప్రకటించింది. దేశంలోని 35కి పైగా నగరాల్లో 75కు పైగా మల్టీప్లెక్స్‌ ఉన్నట్లు ఈ 75 కు పైగా మల్టీప్లెక్స్‌ లో ఈ మ్యాచ్‌లు ప్రసారం చేయనున్నాయి అని తెలిపారు. ఇందులో న్యూఢిల్లీ, ముంబై, పూణే, అహ్మదాబాద్ వంటి టైర్-1, టైర్-2 నగరాలు ఉన్నాయి.

T20 World cup Live Theaters

యూఏఈ, ఒమన్ వేదికగా క్రికెట్ అభిమానులను ను అలరించడానికి ధనాధన్ [ T-20 World Cup 2021] టోర్నీ టీ -20 ప్రపంచ కప్ రెడీ అవుతోంది. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు ఇప్పటికే యూఏఈ చేరుకున్నాయ్. అక్టోబర్‌ 17 న ఈ టోర్నీ టీ20 ప్రపంచకప్‌ 2021 ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచులు జరుగుతుండగా.. ఈ నెల అక్టోబర్ 17న క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. స్టేడియాలకి వెళ్లి మ్యాచ్ చూడలేని క్రికెట్ లవర్స్ (Cricket Lovers) కి గుడ్ న్యూస్ తెలిపింది ఐసిసి.

T20 World cup Live Theaters

ఇంతకీ టికెట్ ధర ఎంత అంటే…..క్రికెట్‌ మ్యాచ్‌ల వీక్షణకు టికెట్టు ధర నగరాన్ని బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు ఉంటుందని తెలిపారు. ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌కు 70 నగరాల్లో 56 మల్టీప్లెక్స్‌లు, 658 థియేటర్లు ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే టికెట్ విక్రయించనునట్లు సంస్థ స్పష్టం చేసింది. ఈ సంస్థ ఇటీవల లక్నోలోని పలాసియో మాల్‌లో, ముంబైలోని మలాడ్ లోని ఇనార్బిట్ మాల్‌లో మల్టీప్లెక్స్‌లను ప్రారంభించింది.

T20 World cup Live Theaters
Share
%d bloggers like this: