ఈ ఆహార పదార్థాలు మీకు ఎటువంటి హాని కలగనివ్వవు.

ఈ ఆహార పదార్థాలు మీకు ఎటువంటి హాని కలగనివ్వవు.

“షుగర్ పేషెంట్స్ తినాల్సినవి మరియు తినకూడనివి తెలుసుకుందాం.. “

NATURAL FRUITS DIABETIS TREATMENT

షుగర్ జబ్బు పేరులోనే తీపి ఒక్కసారి దీని బారిన పడితే జీవితాంతం చేదు. రక్తంలో చెక్కర శాతం అదుపులో ఉండేందుకు నిత్యం మందులు మింగాలి. తినే ఆహారంలో తీపి లేకుండా త్వరగా అరిగిపోయే ఆహారాలను తీసుకోవాలి దీనికితోడు శరీరానికి కావాల్సినంత శ్రమను కలిగించాలి.ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మధుమేహం మన అదుపులో ఉంటుంది. షుగర్ తో బాధపడుతున్నప్పుడు ఏం తినాలో ఏం తినకూడదో చాలా మందిని అనుమానంతో వేధిస్తుంటాయి. ఆ సందేహం తోనే ఆహారంలో చాలా మార్పులు చేసుకుంటారు.అన్నం మానేస్తారు, ఉత్తి చపాతీ తింటారు, స్వీట్లు చివరికి పండ్లకు దూరంగా ఉంటారు.

NATURAL FRUITS DIABETIS TREATMENT

నిజానికి షుగర్ జబ్బుకు పద్యాలు పాటించాల్సిన అవసరం లేదు. అన్ని రకాల ఆహారాన్ని తీసుకుంటూనే. ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.ఆహారంలో తగ్గించాల్సినవి.నూనె వస్తువులు, కొవ్వు పదార్ధాలను పూర్తిగా తగ్గించాలి.అన్నం క్వాంటిటీ తగ్గించాలి. తీపి వస్తువులు పూర్తిగా మానేయాలి. ఎస్పెషల్లీ టీ కాఫీ లో షుగర్ వాడడం స్వీట్స్, తేనే వస్తువులు, జెల్లీస్ పూర్తిగా తగ్గించాలి.అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు.

మనకి రకరకాల ఆహార పదార్ధాలు ఉన్నాయి జొన్నలు,రాగులు, గోధుమలు ఇవన్నీ ఉన్నాయి. మనకి జనరల్ గా ఈ మనీ మార్కెట్లో పాలిష్ చేసి దొరుకుతాయి. పాలిష్ వి కాకుండా పొట్టుతో దొరికే బ్రౌన్ రైస్ ఇలాంటివి తినొచ్చు.
డిన్నర్ లో గోధుమలతో గాని జొన్నలతో చేసిన గాని చపాతీలు తింటే సరిపోతుంది.అరటి పండ్లు, సపోట ఈ తగ్గించుకొని తీసుకోవడం బెటర్ షుగర్ ఉన్న వాళ్ళు.జామకాయ, బొప్పాయి, దానిమ్మ ఇవి తీసుకోవచ్చు. పండ్ల రసాలు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే దాంట్లో ఉన్న పీచు మొత్తం పోతుంది తీసుకున్న పెద్ద ఉపయోగం ఉండదు.

NATURAL FRUITS DIABETIS TREATMENT

మధుమేహాన్నిఅదుపులో ఉంచేందుకు అన్నాన్ని మానేయాల్సిన అవసరం లేదు బియ్యాన్ని పాలిష్ పట్టించకుండా వండితే సరిపోతుంది. లేదా పాత బియ్యాన్ని వాడితే సరిపోతుంది. పాత గోధుమలు, రాగులు, జొన్నలు వంటి ధాన్యాలను తరచుగా తీసుకోవాలి.కాయ కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా తినాలి. ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. వేపుడు పదార్థాలు తగ్గించుకోవాలి.

NATURAL FRUITS DIABETIS TREATMENT
Share
%d bloggers like this: