రెండు పూటలే భోజనం.. శవమే శివం అనుకుంటారు. తప్పక చూడండి.

రెండు పూటలే భోజనం.. శవమే శివం అనుకుంటారు. తప్పక చూడండి.

శవం అంటేనే భయపడి ఆమడ దూరం పోయేవాళ్ళు ఉన్నారు. పోస్టుమార్టం చేసే సమయంలో కొంత మంది మృతుల దేహాలు కుళ్లిపోయి పురుగులు పట్టి ఉంటాయి. ఆ మృతదేహాలను చూస్తే సామాన్య ప్రజలు భయంతో వణికిపోతారు . కానీ ఫోరెన్సిక్‌ వైద్యులు, సిబ్బంది మాత్రం వృత్తిధర్మంగా భావించి మృతదేహాల నుండి వచ్చే చెడు వాసనలను భరిస్తూ తమ విధులను నిర్వహిస్తారు. ఒక్కోసారి మృతదేహాలను కోసే సమయంలో లీటర్ల కొద్దీ రక్తాన్ని జగ్గుతో తోడిపోయడం వంటి దృశ్యాలను చూస్తూ రిపోర్ట్‌ రాసుకోవాల్సిందే. ఈ ఘోరమైన వాతావరణంలో నుంచి ఇంటికి వెళ్లినా మార్చురి నుండి వచ్చే దుర్వాసన శరీరంపై వస్తూనే ఉంటుంది. ఇలాంటి పరిస్తితి కి తోడు పోస్టుమార్టంకు సంబంధించిన కొన్ని ఫోటోలు కొన్ని సమయాల్లో ఇంట్లోనూ పరిశీలిస్తూ కేసును ఛేదించాల్సిన పరిస్థితి ఈ ఫోరెన్సిక్‌ వైద్యులది.

Death Stories Forensic Doctors

కర్నూలు జిల్లా జీజీహెచ్‌లో ప్రతి సంవత్సరం 1500 దాకా పోస్టుమార్టంలు నిర్వహిస్తారు.జీజీహెచ్‌లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తారు. సెలవు దినాలలో సైతం మధ్యాహ్నం 1 గంటల వరకు పోస్టుమార్టం నిర్వహిస్తారు. ఆ రోజులో అన్నీ మృతదేహాలకు పోస్టుమార్టం అయిపోయాకె వాళ్ళు భోజనం చేయాల్సి వస్తోంది. ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల తర్వాతే ఇంటికి వెళ్లి స్నానం చేసిన తర్వాతే భోజనం చేస్తున్నారు. పోస్టుమార్టం ముగిసేవరకు ఎలాంటి ఆహారం తీసుకోవడానికి వీలుండదు. ఈ కారణం చేత వాళ్ళు ఉదయం అల్పాహారం చేసి, మళ్లీ రాత్రి భోజనంకు మాత్రమే తీసుకుంటున్నారు.

Death Stories Forensic Doctors

ఈ మెడికల్‌ కాలేజి కర్నూలు లో 1954లో స్థాపించారు. కాలేజి నిర్మాణం తోనే ఫోరెన్సిక్‌ విభాగం కూడా ఏర్పాటు అయింది. ప్రస్తుతం ఈ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్‌ ఆర్‌. శంకర్‌(హెచ్‌వోడి), డాక్టర్‌ పి. బ్రహ్మాజీ మాస్టర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వి. రాజశేఖర్, సీనియర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వైకేసి రంగయ్య, మరో నలుగురు కన్సాలిడేట్‌ పే అసిస్టెంట్‌ వైద్యులు, ఇద్దరు పీజీ వైద్య విద్యార్థులు పనిచేస్తున్నారు. మరో నాలుగు ట్యూటర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Death Stories Forensic Doctors
Share
%d bloggers like this: