మలబద్ధకం తో బాధపడుతున్నారా? అయితే ఈ విడియో చూడండి.

మలబద్ధకం తో బాధపడుతున్నారా? అయితే ఈ విడియో చూడండి.

కొంత మందికి మలబద్దకం రకరకాలుగా ఉంటాయి. కొంతమందిలో ప్రేగులలో ఇరిటేషన్ వలన మలం వచ్చిన్నట్టుగా అనిపించి టాయ్లెట్ వెళ్ళగానే మళ్ళీ రాదు. వీళ్ళు రోజులో 5 నుండి 7 సార్లు పోతూ ఉంటారు. ఇలాంటి బాధ పడే వారి ప్రేగులలో బలాన్ని పెంచి మలబద్దకాన్ని తగ్గించే గొప్ప చిట్కా ఇది. మలవిసర్జన సాఫీగా జరగడానికి ఈ కింది రెండు ఆసనాలను చేయండి.

మొదటి ఆసనం: ఈ ఆసనాన్ని సేతు బందాసనం అంటారు. ఈ ఆసనానికి మొదటగా రెండు దిండులని ఏర్పాటు చేసుకోవాలి. ఈ దిండులను ఒక దానిపై మరొకటి ఉంచాలి. తరువాత ఆ దిందు చివరి భాగంలో కూర్చొని మెల్లగా నడుము బాగాన్ని మొత్తం దిండు పై ఆనిచ్చి తలను వెనక్కి వంచి చేతులతో కాలి మడమ బాగాన్ని పట్టించాలి. ఈ ఆసనం మూడు నుండి నాలుగు నిమిషాలు ఉండాలి.

రెండవ ఆసనం: ఈ ఆసనంలో బోర్లా పడుకోవాలి. రెండు చేతులు ముందుకి సమానంగా ఉంచాలి. ఆ తరువాత ఎడమ కాలు, కుడి చెయ్యి ఒకే సారి లేపాలి. ఉంచగలిగిన సమయం ఉంచి రెండిటినీ ఒకే సారి దించాలి. ఒక పది సెకనులు విశ్రాంతి తీసికొని కుడి కాలు, ఎడమ చేయి ఒకే సారి లేపాలి. ఈ విధంగా చేయడం వలన ప్రేగులలో ఇరైటేషన్ తగ్గి మల విసర్జన సాఫీగా జరుగుతుంది.

Share
%d bloggers like this: