మీ పాన్ కార్డ్ పై ఉన్న అంకెల ప్రత్యకత ఎంతో తెలుసా?

మీ పాన్ కార్డ్ పై ఉన్న అంకెల ప్రత్యకత ఎంతో తెలుసా?

పాన్ కార్డులో వ్రాసిన సంఖ్యను శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) అంటారు.పాన్ కార్డ్ లేకుంటే ఏ విధమైన ఆర్థిక లావాదేవీలు చేయలేరు. బ్యాంక్ నుంచి ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలి అన్న, పెట్టుబడి పథకంలో పాన్ కార్డు కచ్చితంగా అవసరం. అయితే చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే వీలైనంత త్వరగా దానిని ఆధార్ నంబర్‌తో లింక్ చేయడం తప్పనిసరి అని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ జూన్ 30 ను చివరి తేదీగా నిర్ణయించింది. పాన్ కార్డుకు సంబంధించిన మరొక సమాచారం ఏంటంటే దానిపై పేర్కొన్న సంఖ్యల అర్థం తెలుసుకోవాలి.

ఈ పాన్ కార్డ్ ను ఆదాయపు పన్నుశాఖ వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ జారిచేస్తుంది. పాన్ కార్డ్ పై పది అంకెల ఒక పర్మినెంట్ నెంబర్ ఉంటుంది. పాన్ కార్డ్ ను వ్యక్తి గతంగా తీస్కున్న సంస్థ నుండి తీస్కున్న ఈ పది అంకెల కోడ్ కచ్చితంగా ఉంటుంది. ఈ పది అంకెల కోడ్ కి ఒక్కో నెంబర్ కి ఒక్కో కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ప్రత్యేకత ఉంటుంది అని చాలా మందికి తెలినే తెలియదు. కానీ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి.

ప్రతి ఒక్కరి పాన్ కార్డ్ మీద ఆ పది అంకెల కోడ్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కొంత మంది పాన్ కార్డ్ మీద ఒక్కోసారి ఇంగ్లీష్ అక్షరం ‘O’, సున్నా ‘0’ (జీరో)కి మధ్య వ్యత్యాసాన్ని గుర్తుపట్టకపోవచ్చు. మీరు సంఖ్యల వెనుక ఉన్న అర్థం తెలుసుకుంటే చాలా సులభంగా గుర్తించవచ్చు.పాన్‌లో మొదటి మూడు అక్షరాలు AAA to ZZZ సిరీస్‌లో ఉంటాయి. నాలుగో అక్షరం ఆదాయ పన్ను శాఖ దృష్టిలో మీరు ఏంటి అనేది చెప్తుంది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులందరికీ నాలుగో అక్షరం “P” అనే ఉంటుంది. ఈ “P” అనే అక్షరం వెనుక ఉన్న ప్రత్యేకత ఎంటో తెలుసుకుందాము.

  • “A” – అంటే వ్యక్తులు లేదా సంస్థల బృందం (అసోసియేట్ ఆఫ్ పర్సన్స్‌-ఏఓపి)
  • “B” – వ్యక్తుల బృందం (బిఓఐ)
  • “C” – అని ఉంటే కంపెనీ
  • “G” – ప్రభుత్వ ఏజెన్సీ
  • “F” – సంస్థ లేదా పరిమిత భాగస్వామ్య సంస్థ
  • “H” – అని ఉంటే హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్‌)
  • “J” – తాత్కాలిక న్యాయవ్యవస్థ
  • “L” – స్థానిక అధికారిక కేంద్రం
  • “P” – అంటే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడు
  • “T” – ట్రస్ట్‌
Share
%d bloggers like this: