విడుదల చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్.

విడుదల చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్.

Bholashankar Movie Title Released: మేగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ‘భోళా శంకర్’ చిత్రం టైటిల్ వీడియోను సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ రోజు ఉదయం విడుదల చేశారు.చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ చిత్ర వివరాలను వెల్లడిస్తూ, ట్విట్టర్ లో వేగంగా 1 మిలియన్ వ్యూస్ సాధించిన టైటిల్ వీడియోగా చిరంజీవి ‘భోళా శంకర్’ కొత్త రికార్డు నెలకొల్పింది అని తెలియజేశారు.

Bholashankar Movie Title Released
(ప్రతీకాత్మక చిత్రం)

ఈ చిన్న టైటిల్ వీడియో విడుదల చేసిన కొన్ని గంటల్లోనే రికార్డ్ బద్దలు కొట్టింది. మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘భోళా శంకర్’ టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే రికార్డుల పర్వం షురూ చేసింది. ఈ చిత్రం తమిళంలో అజిత్ నటించిన బ్లాక్ బస్టర్ అయిన చిత్రం. తమిళంలో అజిత్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్టయిన వేదాళం రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కుతోంది. Bholashankar Movie Title Released

Bholashankar Movie Title Released
(ప్రతీకాత్మక చిత్రం)

తమిళంలో అజిత్, లక్ష్మీమీనన్ అన్నాచెల్లెళ్ల పాత్రల్లో నటించగా, తెలుగులో ఈ చిత్రం లో చిరంజీవి, కీర్తి సురేశ్ ఆ పాత్రల్లో కనువిందు చేయనున్నట్టు తెలుస్తోంది.’భోళా శంకర్’ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించనున్నారు. మేగాస్టార్ పుట్టిన రోజున ఫ్యాన్స్ కి సంతోషమైన వార్తతో ఆనందాన్ని పంచారు.

Bholashankar Movie Title Released
(ప్రతీకాత్మక చిత్రం)
Share
%d bloggers like this: