మహిళలకు శుభవార్త..ఒక్కొకరి ఖాతాలోకి నేరుగా 15 వేల రూపాయలు.

మహిళలకు శుభవార్త..ఒక్కొకరి ఖాతాలోకి నేరుగా 15 వేల రూపాయలు.

కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు. సరైన లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తూ తాను ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నాడు. వరుసగా రెండో ఏడాది సిఎం క్యాంప్ ఆఫీసు నుండి వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం లాంఛనంగా ప్రారంభించారు.

ysr kapu nestam pathakam

వైఎస్సార్‌ కాపునేస్తం సొమ్ము నేరుగా లబ్దిదారుల ఖాతాలోకి జమ చేస్తారు. ఈ పథకం రెండో సంవత్సరం కాపు, బలిజ, తెలగ ఒంటరి కులాలకు చెందిన 3,27,244 మహిళలకు రూ. 490.86 కోట్ల ఆర్థిక సాయం నేరుగా ఖాతాలోకి వెళ్ళేలా చేశారు. ఈ ఆర్థిక సాయాన్ని బ్యాంక్ లు పాత అప్పుల కింద జమ చేసుకోకుండా లబ్దిదారులకు అందేలా చేయాలని చెప్పారు. ఈ పథకం కింద ప్రతి ఏటా 15 వేల రూపాయల చొప్పున 5 సంవత్సరాలకు 75 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.

ysr kapu nestam pathakam

వైఎస్సార్‌ కాపునేస్తం ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన 45-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15 వేల చొప్పున సాయం అందిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గతేడాది ఈ పథకాన్ని ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాపు పేద మహిళలకు ఆపన్న హస్తం అందించనున్నట్లు జగన్ ప్రకటించారు. పేద మహిళల ముఖాలలో చిరునవ్వులు పూయించాలనే ఉద్దేశ్యం తో ఈ పథకానికి గతేడాది ఈ శ్రీకారం చుట్టారు.

ysr kapu nestam pathakam
Share
%d bloggers like this: