అమెజాన్ బంపర్ ఆఫర్ నెలకు 50 నుండి 60 వేలు సంపాదించే అవకాశం.

అమెజాన్ బంపర్ ఆఫర్ నెలకు 50 నుండి 60 వేలు సంపాదించే అవకాశం.

అమెజాన్ అనగానే అందరికీ గుర్తువచ్చేది మనకు కావాల్సిన ప్రతి వస్తువు దానిలో దొరుకుతుంది. ఎవరు ఏం ఆర్డర్ చేసిన ఎంత దూరంలో ఉన్న కొన్ని రోజుల సమయంలోనే ఇంటికి వచ్చేలా రూపొందించారు. అలాంటి సంస్థ చాలా మందికి ఉపాధి కూడా కల్పిస్తుంది. ఆ అమెజాన్ సంస్థ ఇప్పుడు మంచి ఆఫర్ కూడా ఇస్తుంది. రోజుకు నాలుగు గంటలు పని చేస్తే చాలు నెలకు 60 వేలు సంపాదించవచ్చు అని అంటోంది.

amazon bumper offer delivery

అమెజాన్ సంస్థ లో డెలివరీ బాయ్స్ కీలక పాత్ర పోషిస్తుంటారు. కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువులను ఇంటి వద్దకే డెలివరీ చేసే సంగతి తెలిసిందే. డెలివరీ సేవలను మారుమూల గ్రామాలకు విస్తృత పరచాలని అమెజాన్ సంస్థ భావిస్తోంది. డెలివరీ బాయ్స్ కు ఫిక్స్ డ్ సాలరీగా ప్రతినెలా అమెజాన్ రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు అందిస్తోంది. కానీ ఇప్పుడు డెలివరీ ఎగ్జిక్యూటివ్ బాగా సంపాదించే అవకాశం వచ్చింది. డెలివరీ ఎగ్జిక్యూటివ్ రోజు నాలుగు గంటలు పనిచేస్తే సుమారు 55 వేల నుండి 60 వేల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది అని అమెజాన్ వెల్లడించింది.

amazon bumper offer delivery

డెలివేరి బాయ్ ఇప్పుడు ఒక ప్యాకేజీ డెలివరీ ఇస్తే 10 రూపాయల నుండి 15 రూపాయల కమిషన్ వస్తుంది. ఇలా ఒక్క రోజులో 100 నుండి 150 ప్యాకేజీ లను డెలివేరి చేస్తే నెలకు గరిష్టంగా 60 వేల రూపాయలు సంపాదించవచ్చు అని చెప్తుంది. ప్యాకేజీల డెలివరీ దూరం విషయంలో స్పష్టత ఇచ్చింది. కంపెనీ ప్రకారం ప్యాకేజీల డెలివరీ 10 కిలోమీటర్ల నుంచి 15 కి.మీటర్ల దూరంలో ఉంటుందని తెలిపింది. ప్యాకేజీలను సుమారు నాలుగు నుంచి ఐదు గంటల్లో డెలివరీ చేసే అవకాశం ఉందని అమెజాన్ వెల్లడిస్తోంది. ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు, ఇలాంటి మంచి అవకాశాన్ని వాడులుకోకండి.

amazon bumper offer delivery
Share
%d bloggers like this: