17 ఏళ్ల కల నెరవేర్చుకున్న యాక్షన్ కింగ్ హీరో అర్జున్ కల.

17 ఏళ్ల కల నెరవేర్చుకున్న యాక్షన్ కింగ్ హీరో అర్జున్ కల.

హీరో అర్జున్ గుర్తున్నాడా? శ్రీ ఆంజనేయం సినిమా లో ఆయన భక్తి చూశారు కదా. శ్రీ రాముని పై ఆ భక్తి ఆ గుడి కట్టించడానికి చేసిన మహత్యం గుర్తుంది కదా.. అదే భక్తి తో యాక్షన్ కింగ్ అర్జున్ తన అద్భుత భక్తిని చాటుకున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా హనుమంతుడికి పరమ భక్తుడని ప్రత్యేకంగా ఎవరికిచెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్ కింగ్ అర్జున్ 2004లో శ్రీ ఆంజనేయం సినిమా చేసినప్పటి నుంచి హనుమంతుడి పట్ల భక్తిని పెంచుకున్నాడు. హనుమంతుడి ఆలయం నిర్మించాలి అనే కల కన్నా హీరో అర్జున్ ఏం చేశాడు అంటే చెన్నైలో హనుమంతుడికి ఆలయం కట్టించి అతని కల 17 ఏళ్లకు నెరవేర్చుకున్నాడు.. 2005 సంవత్సరం లో పెజావర్ సీర్ విశ్వేత తీర్థ చేతుల మీదుగా హనుమంతుడి ఆలయానికి శంకు స్థాపన చేయించాడు హీరో అర్జున్. కర్ణాటక శిల్పి అశోక్ గుడిగర్ సారథ్యంలో 35 అడుగుల ఎత్తైన హనుమంతుడి ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశాడు.

action king arjun temple

హనుమాన్ భక్తుడి గా మారిన హీరో అర్జున్ ,ప్రతీ రోజూ కొలుచుకునే హనుమంతుడికి గుడి కట్టించాలన్నది నా కల పేర్కొన్నాడు. ఎన్నో సంవతర్సరాల అతని కల నెరవేరింది అని తెలిపాడు. అతని కుటుంబసభ్యులు మరియు స్నేహితుల సమక్షంలో గుడి ప్రారంభ ఉత్సవం నిర్వహించాలనుకున్నా అని కరోనా ప్రభావంతో సాధ్యం కాలేదని అర్జున్ అన్నాడు. రవాణా ఆంక్షలుండటంతో మేఘనా రాజ్‌, జూనియర్ చిరు ఈవెంట్ కు రాలేకపోయారని చెప్పాడు. అర్జున్ ఆలయ పూజ, ప్రారంభ కార్యక్రమంలో కుటుంబసభ్యులతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. చెన్నైలోకరోనా ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో ప్రజల ఆలయాన్ని సందర్శించే ఏర్పాట్లు చేశారు.

action king arjun temple
Share
%d bloggers like this: