ముకేష్ అంబానీ ఒక్క రోజు సంపాదన ఎంతో తెలుసా?

ముకేష్ అంబానీ ఒక్క రోజు సంపాదన ఎంతో తెలుసా?

ఆసియాఖండంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ సంపద కేవలం ఒక వారం రోజుల్లోనే 6.2 బిలియన్ డాలర్లు సంపద పెరిగింది. ముఖేష్ అంబానీ ప్రధాన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర 10 శాతానికి పైగా ర్యాలీ చేయడంతో ఒకే సారిగా ఆయన సంపద వృద్ది చెందింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ సూచీ ప్రకారం.. అంబానీ నికర ఆస్తి విలువ జూన్ 1, 2021(మంగళవారం) నాటికి 83.2 బిలియన్ డాలర్లు(రూ. 6.07 లక్షల కోట్లు)గా ఉంది. మే 23న 77 బిలియన్ డాలర్ల(రూ. 5.62 లక్షల కోట్లు) సంపదను కలిగి ఉన్నాడు. స్టాక్ ఎక్స్ఛేంజీ తాజా డేటా ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ముఖేష్ అంబానీ 49.14శాతం వాటాను కలిగి ఉన్నారు. India’s number one businessman Mukesh Ambaani-entertainmentdessert.com

India's number one businessman

త్వరలోనే ఈ స్టాక్ ధర రూ.2,580 చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఆర్‌ఐఎల్ షేర్లు మంగళవారం 0.5 శాతం పెరిగి రూ.2,169 చేరుకుంది. ఇక్కడ ప్రస్తావించదగిన మరో విషయం ఏమిటంటే, గత ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఆర్‌ఐఎల్ స్టాక్ ధర దాదాపు మూడు రెట్లు పెరిగింది. మార్చి 23న కనిష్ట ధర 875 రూపాయల నుంచి సెప్టెంబర్ 16న రూ.2,324కు చేరుకుంది. నిరంతరం జియో ప్లాట్‌ఫామ్‌, రిటైల్ బిజినెస్‌ల్లోకి నిధుల సేకరణ చేపట్టడంతో రిలయన్స్‌ స్టాక్ మార్కెట్లలో వృద్ది కనబడింది. India’s number one businessman Mukesh Ambaani-entertainmentdessert.com

India's number one businessman

ప్రతి రోజు ట్రేడింగ్ ఇలానే కొనసాగితే త్వరలో ముఖేష్ అంబానీ వ్యక్తిగత సంపదలో మరో 10 బిలియన్ల డాలర్లు జత కలుస్తాయని అంచనా వేస్తున్నారు. స్వల్ప కాల వ్యవధిలో రిలయన్స్ షేర్లు మరో 15 శాతం పెరుగుతాయని అంచనా. అదే జరిగితే ప్రపంచ కుబేరుల జాబితాలో 12వ ర్యాంక్ నుంచి 8వ స్థానానికి ఎదుగుతారని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. టెలికాం మరియు రిటైల్ వ్యాపారాలలో వరుస నిధుల సేకరణ మరియు రికార్డు హక్కుల సమస్య తరువాత. అప్పటి నుండి, ఈ స్టాక్ శ్రేణికి కట్టుబడి ఉంది మరియు బెంచ్మార్క్ సూచికలను బలహీనపరిచింది.

Share
%d bloggers like this: