వాట్సాప్ మరో సంచలన నిర్ణయం….కొత్త ప్రైవసీ పాలసీకి అంగీకరించకపోతే పరిమిత సేవలే

వాట్సాప్ మరో సంచలన నిర్ణయం….కొత్త ప్రైవసీ పాలసీకి అంగీకరించకపోతే పరిమిత సేవలే

కొత్త ప్రైవసీ పాలసీకి అంగీకరించకపోతే పరిమిత సేవలే. ఈ కొత్త ప్రైవసీ నిబంధనలు అంగీకరించేలా వాట్సాప్‌ ఒత్తిడి పెంచుతోంది. ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని మాతృసంస్థ ‘ఫేస్‌బుక్‌’తో పంచుకునేందుకు వీలు కల్పించేలా వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ ఉందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలకు అంగీకరించకపోతే ఇప్పటికిప్పుడు ఖాతాను తొలగించకున్నా,వినియోగదారులు పొందే సేవలు పరిమితం చేస్తామని వాట్సాప్‌ తాజాగా ప్రకటించింది. కొద్ది వారాల తర్వాత వినియోగదారులు తమ చాట్‌ లిస్టును చూడలేరని, ఆపై వాట్సాప్‌లో ఫోన్‌ కాల్స్‌ను, వీడియో కాల్స్‌ను అందుకోలేరని స్పష్టం చేసింది. Whatsapp New Privacy Policy-entertainmentdessert.com

Whatsapp New Privacy Policy

అయితే తాజాగా ఆ నిర్ణయాన్ని కూడా మరోసారి వాయిదా వేసింది. కొత్త పాలసీని అప్‌డేట్‌ చేయకున్నా మే 15 నుంచి ఏ అకౌంట్లను నిలిపివేయబోమని స్పష్టం చేసింది. ఖాతాలను తొలగించేది లేదని వాట్సాప్‌ హామీ ఇచ్చింది. ఐతే వాట్సాప్‌ కొత్త నిబంధనలు అంగీకరించకపోతే వాట్సాప్‌ సేవలను మాత్రం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేరు. యూజర్లు కాల్స్, నోటిఫికేషన్లను మాత్రమే పొందగలుగుతారు. గతంలో మాదిరిగానే టెక్స్ట్‌, వీడియో కాలింగ్‌తో సహా అన్ని ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. Whatsapp New Privacy Policy-entertainmentdessert.com

Whatsapp New Privacy Policy

ఇప్పుడు వినియోగదారులకు ఎన్నివారాల గడువు ఇస్తున్నదీ స్పష్టం చేయలేదు. రిమైండర్ల తర్వాత కూడా స్పందించకపోతే వారు అందుకునే సేవలను పరిమితం చేస్తామని తెలిపింది. ఇలా కొద్దివారాల పరిమిత సేవల తర్వాత కూడా కొత్త ప్రైవసీ పాలసీని ఆమోదించని వారికి ఇన్‌కమింగ్‌ కాల్స్, నోటిఫికేషన్స్, మెసేజ్‌లు నిలిపివేస్తామని వాట్సాప్‌ ప్రకటించింది. ఖాతాలను తొలగించబోమని చెబుతూనే… వాట్సాప్‌ను కొంతకాలం వాడని వినియోగదారుల విషయంలో తాము అనుసరించే విధానాన్ని ఎత్తిచూపింది. ఎవరైనా వాట్సాప్‌ను 120 రోజులు వినియోగించకపోతే… సదరు ఖాతాను వాట్సాప్‌ తొలగిస్తుంది. ప్రైవసీ పాలసీని అంగీకరించకపోతే కొద్దివారాల తర్వాత మన ఫోన్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి. ఆపై సదరు ఖాతా ఇన్‌యాక్టివ్‌గా మారిపోతుంది. 120 రోజుల తర్వాత మీ యొక్క వాట్స్ యాప్ ఖాతాను తొలగిస్తారన్న మాట.

Share
%d bloggers like this: