ఎస్‌బీఐలో మరింత వెసులుబాటుతో గృహరుణాలు. ప్రారంభ వడ్డీ  రేటు 6.95 శాతం మాత్రమే.

ఎస్‌బీఐలో మరింత వెసులుబాటుతో గృహరుణాలు. ప్రారంభ వడ్డీ రేటు 6.95 శాతం మాత్రమే.

ఇప్పటికే అతితక్కువ వడ్డీ రేట్లను హోం లోన్స్ అందిస్తోన్న విషయం తెలిసిందే.ప్రభుత్వరంగంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ), ఇప్పడు ఆ వడ్డీరేట్లను మరింత తగ్గించింది. ప్రారంభ వడ్డీరేటును 6.95 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించినట్టు ప్రకటించింది.. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. SBI bank new home loans-entertainmentdessert.com

SBI bank new home loans

వడ్డీ రేట్ల తగ్గింపు తమకు మరింత కలిసి వస్తుందని బ్యాంకు అంచనా వేస్తోంది.ఇక, మహిళలకు ఐదు బేసిస్‌ పాయింట్ల ప్రత్యేక రాయితీ కూడా ఇస్తున్నట్టు వెల్లడించింది. ఇక, తక్కువ వడ్డీలకు లభించే గృహరుణాలకు ఖాతాదారుల నుంచి పెద్దఎత్తున డిమాండ్ వస్తుందని ఆశిస్తున్నట్టు ఎస్‌బీఐ పేర్కొంది. మరికొన్ని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. SBI bank new home loans-entertainmentdessert.com

SBI bank new home loans

రూ. 30 లక్షల వరకు గృహ రుణాలపై 6.7 శాతం వడ్డీయే ఉంటుందని ఎస్‌బీఐ పేర్కొంది.మహిళలైతే 6.65 శాతం వడ్డీకే రుణం పొందే ఆఫర్ తెచ్చింది. మరోవైపు రూ. 30 -రూ. 75 లక్షల వరకు రుణాలపై వడ్డీరేటు 6.95 శాతంగా ఉండనుండగా, రూ. 75 లక్షల కుపైబడిన రుణాలపై 7.05 శాతం వడ్డీని ఖరారు చేసింది. ఖాతాదారులు… YONO యాప్‌ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నపక్షంలో వడ్డీరేటుపై అదనంగా 5 బేసిస్‌ పాయింట్ల రాయితీ పొందవచ్చని బ్యాంకు వెల్లడించింది.

Share
%d bloggers like this: