
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో బిజీ బిజీగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో రేపు తెలంగాణ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని భద్రతా చర్యల దృష్ట్యా రేపు ఎన్టీఆర్ గార్డెన్, లుంబినిపార్క్లను మూసివేయనున్నట్లు హెచ్ఎండీఏ తెలిపింది.
ప్రతి నిత్యం జనం తో రద్దీగా ఉండే ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్కులను ప్రధాని భద్రత ఏర్పాట్లలో భాగంగా మూసివేయాలని పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది.ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి బేగంపేట్ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రాజ్ భవన్ మీదుగా ఎల్.బీ.స్టేడియంకు చేరుకుంటారు.
మన దేశ ప్రధాని హైదరాబాద్‌కి వచ్చే కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగనున్నాయి అని పోలీసు అధికారులు తెలిపారు. అయితే బేగంపేట్, రాజ్‌భవన్ రోడ్డు, లక్డీకాపుల్, పీవీ మార్గ్, ఐమాక్స్, సచివాలయం, బషీర్‌బాగ్ ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగనున్నట్లు ట్రాఫిక్ పోలీసు అధికారుల తెలిపారు. ముఖ్యంగా ఈ మార్గాల్లో ప్రయాణించే వారు ఈ ఒక్క రోజు ప్రత్యమ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ప్రజలకి సూచించారు.