
ఒకప్పుడు సినిమా స్టార్స్ కి ధీటుగా టిక్ టాక్ స్టార్ లు మెరిసిపోయారు. అయితే ఈ మధ్యే కెనడాలో జరిగిన భారతీయ టిక్‌టాక్ స్టార్ మేఘా ఠాకూర్ మరణం నెట్టింట కలకలం రేపుతోంది. ఈ టిక్ టాక్ స్టార్ కేవలం 21 వయసులో ఆమె ఆకస్మికంగా మృతి చెందారు.ఈమె టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయినప్పకటికి ఈమె గురించి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ మేఘా ఠాకూర్ మృతి చెందినట్లు ఆమె తల్లిదండ్రులు ఇన్సాస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. మేఘా ఠాకూర్ నవంబర్ 24వ తేదీన మరణించినట్టు వెల్లడించారు.

మేఘ ఠాకూర్ కుటుంబసభ్యులు భారమైన మనసుతో ఈ విషయం నవంబర్ 24వ తేదీన తమ జీవితాల్లోని వెలుగు అకస్మాత్తుగా, అనుకోకుండా ఈ లోకం విడిచి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.మేఘ ఠాకూర్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలో 2001 జులై 17న మేఘా జన్మించారు. ఈమె ఓంటారియో ప్రావిన్స్‌లోని మే ఫీల్డ్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. మేఘా 2019లో ఒంటారియోలోని వెస్టర్న్ యూనివర్సిటీలో చేరారు.

ఈమె ఇతర సామాజిక వేదికల్లో కూడా ఆమె బాగా యాక్టివ్‌గా ఉండేవారు. 2019 సంవత్సరంలోనే ఆమె టిక్‌టాక్‌లో ప్రవేశించారు. మేఘా ఠాకూర్ మోడల్‌గా కూడా సుపరిచితురాలైన 2019లో జరిగిన CAISA Fashion Showలో ర్యాంప్ వాక్ కూడా చేశారు. మేఘా ఠాకూర్ బాడీ పాజిటివిటీపై మేఘా టిక్‌టాక్‌లో మంచి స్ఫూర్తివంతమైన వీడియోలు పోస్ట్ చేశారు. మన శరీరం రంగు ఎలా ఉన్నా, బరువు, ఎత్తు, ఇతర శారీరక లక్షణాలు ఎలా ఉన్నా గర్వంగా తలెత్తుకు తిరగాలని చెబుతూ ఆమె మేఘా చేసిన వీడియోలు టిక్ టాక్ లో ఎందరినో ఆకట్టుకున్నాయి.

ఇక మేఘా ఠాకూర్ చేసిన కామెడీ వీడియోలు కూడా నెటిజన్ల మెప్పు పొందాయి. ఆమె తన ఫాలోవర్లు, ఫ్యాన్స్, తనను వ్యతిరేకించే వారి కామెంట్స్‌కూ తరచూ సమాధానం ఇస్తుండేవారు.అయితే మేఘా ఠాకూర్ వ్యక్తిగత గోప్యతకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు. మేఘా మరణానికి కారణమేంటో కూడా ఆమె తల్లిదండ్రులు ఇంకా వెల్లడించలేదు. మేఘా ఠాకూర్ నవంబర్ 29న అంత్యక్రియలు నిర్వహించారు. అయితే కొందరు ఆమె అభిమానులు మాత్రం ఆమె కారు ప్రమాదంలో మరణించి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు.
