చిన్న దాబాలో భోజనం చేస్తున్న వీరు ఎవరో గుర్తు పట్టారా?

ALLU-ARJUN

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన, ఆ సంఘటన కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా క్షణాల్లో మనకు చెరిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ ర్జున్ గురించి ప్రత్యేకంగా ఎవ్వరికీ పరిచయం అవసరం లేదు.

అప్పుడప్పుడు సెలబ్రిటీలు సాధారణ వ్యక్తుల మాదిరి కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు.అయితే తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అయితే ఆ ఫోటో లో బన్నీ దంపతులు దాబాలో భోజనం చేస్తున్నట్లు ఆ ఫోటోలు కనిపిస్తుంది.

సినీ తారలు వ్యక్తిగతంగా తరచూ పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయితే ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సమయంలో నంద్యాల జిల్లాలో హీరో అల్లు అర్జున్ పర్యటించారు. అదే క్రమంలో ఆయన భార్య స్నేహ రెడ్డితో కలిసి బన్నీ నంద్యాల వెళ్లారు. అక్కడ తన స్నేహితుడు, వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపారు.

అయితే ఈక్రమంలోనే అక్కడికి భారీ ఆయన ఫ్యాన్ వచ్చారు.అల్లుఅర్జున్ దంపతులు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బన్నీ దంపతులు ఎక్కడి నుండి వస్తున్నారో తెలియదు కానీ.. హైదారాబాద్ వస్తున్న క్రమంలో ఓ దాబా వద్ద అల్లుఅర్జున్ దంపతులు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

అయితే బన్నీ దంపతులు ఓ సాదా సీదా దాబాలో భోజనం చేస్తున్న ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి. అల్లు అర్జున్ ఫోన్ లో మాట్లాడుతుండగా పక్కనే స్నేహరెడ్డి భోజనం చేస్తూ కనిపించారు. సాధారణ వ్యక్తిలా ఓ దాబాలో భోజనం చేయడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గొప్పవారు చిన్న దాబాలో భోజనం చేయడం అంటే అభిమానులకు పండగే కదా అయితే అల్లుఅర్జున్ దంపతులకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *